calender_icon.png 19 April, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

16-04-2025 05:16:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో అందించిన ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు దోమకొండ మండల కేంద్రంలో వ్యాధులు పశువులకు రాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, డాక్టర్ శివ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం(Immunization Program) నిర్వహించారు. కార్యక్రమంలో 42 గేదెలు, ఎనిమిది ఆవులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు పశువైద్య సిబ్బంది రమేష్ బాబులతో ఇప్పించారనీ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల ఎనిమిది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ టీకాల కార్యక్రమం మే 14 తేదీ వరకు ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పాడి, పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.