ముంబై, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న మొ త్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. వడ్డీ రేట్లను సవరించకపోవడం ఇది వరుసగా నాల్గవ త్రైమాసికం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్స్‌తో సహా అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు 2024 జనవరి 1 నుంచి యథాతథంగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం జనవరి 1 నుంచి మార్చి 31తో ముగిసే 4వ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలకు మూడవ త్రైమాసికానికి (2024 అక్టోబర్ 1-2024 డిసెంబర్ 31 వరకూ ప్రకటించిన వడ్డీ రేట్లే కొనసాగుతాయని మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వడ్డీ రేట్లు ఇలా..
తాజా నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి స్కీమ్‌పై వడ్డీ రేటు 8.2 శాతంకాగా, మూడేండ్ల టెర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.1 శాతం. ప్రాచుర్యం పొందిన పబ్లిక్ ప్రావిడెం ట్ ఫండ్ (పీపీఎఫ్)పై 7.1 శాతం, పోస్టాఫీసు పొదుపు డిపాజిట్ స్కీమ్‌పై 4 శాతం చొప్పు న వడ్డీ రేటును యథాతథంగా అట్టిపెట్టారు. కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం మేర ఆఫర్ చేస్తున్నారు.
ఇందులో చేసిన పెట్టుబడి 115 నెలలకు పరిపక్వం చెందుతుంది. 2025 జనవరి-మార్చి త్రైమాసికానికి నేషనల్ సేవిం గ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటును 7.7 శాతంగా నిర్ణయించారు. మంథ్లీ ఇన్‌కం స్కీమ్‌పై మదుపుదారులకు 7.4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి నోటీఫై చేస్తుంది.