calender_icon.png 5 February, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న సినిమాలే పెద్ద సౌండ్ చేస్తాయి

05-02-2025 12:16:03 AM

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘భవానీ వార్డ్ 1997’. చంద్రకాంత సోలంకితో కలిసి జీడీ నరసింహా నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీశ్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు.

ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నిర్మాత రాజ్ కందుకూరి, పర్వతనేని రాంబాబు అతిథిగా విచ్చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. “భవానీ వార్డ్ 1997’ ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి.

చిన్న సినిమాలే పెద్ద సౌండ్ చేస్తాయి.” అన్నారు. దర్శకుడు నరసింహా మాట్లాడుతూ.. “మ్యూజిక్ మీ అందరినీ భయ పెట్టేలా ఉంటుంది. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. సపోర్ట్ చేయండి” అని అన్నారు. గణేశ్ రెడ్డి మాట్లాడుతూ.. “సీరియల్స్ నుంచి సినిమాకి రావడానికి నేను చాలా కష్టపడ్డాను.

మేం పడ్డ కష్టాన్ని ఎవ్వరూ చూడరు. అందరూ అవుట్ పుట్‌నే చూస్తారు. వదినమ్మ సీరియల్‌లో నాని పాత్రతో అందరూ నన్ను గుర్తు పడతారు” అన్నారు. 

సాయి సతీష్ మాట్లాడుతూ.. “ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు జీడీ నరసింహకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది” అన్నారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్ అని.. పూర్తి హారర్ ఎలిమెంట్స్‌తో ఉంటుందని పూజా కేంద్రే పేర్కొన్నారు.