calender_icon.png 7 November, 2024 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప నష్టాలు

24-07-2024 01:14:26 AM

ముంబయి: పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతూ చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిర్మలమ్మ బడ్జెట్‌పై ఎన్నో అశలు పెట్టుకున్న  మార్కెట్లు ఉదయం ప్రారంభంలో లాభాలతో మొదలయ్యాయి. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంం మొదలయిన తర్వాత కూడా స్థిరంగానే కొనసాగాయి. అయితే ఆ తర్వాత  మార్కెట్ సంబంధిత ప్రకటనలు చేయడం మొదలవగానే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో 79.224.32 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి కొంతమేరకు కోలుకుని 73.04 పాయింట్ల నష్టంతో 80,429.04పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 30.20 పాయింట్ల నష్టంతో 24,479.05 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో టైటాన్, ఐటీసీ, అదానీ స్పోర్ట్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లుగా నిలవగా, ఎల్‌అండ్ టీ, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, మీడియా, ఐటి రంగాల సూచీలు లాభపడ్డాయి.అయితే బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్‌సీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పతనం కాగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించగా వ్యవసాయ సంబంధిత స్టాక్స్ 10 శాతందాకా పెరిగాయి. ట్రేడింగ్‌లో దాదాపు 1488 షేర్లు లాభపడగా, 1949 షేర్లు నష్టపోయాయి.