calender_icon.png 30 December, 2024 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పంగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర..

02-08-2024 12:58:54 AM

ఏటీఎఫ్ ధర 2% పెంపు

ఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను (Commercial LPG Price) పెంచాయి. 19 కిలోల సిలిండ్ప రూ.6.5 - రూ.8కు పెంచి రూ.1,652.50 చేశాయి. నాలుగు నెలల వరుస తగ్గింపు తర్వాత ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. చివరిసారిగా జులైలో సిలిండ్ప కంపెనీలు రూ.30 తగ్గించాయి. మొత్తంగా నాలుగు దఫాల్లో రూ.148 తగ్గిం ది. తాజా పెంపు తర్వాత 19 కిలోల వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర ముంబయిలో రూ.1,605, కోల్కతా రూ.1,764.50, చెన్నై రూ.1,817, హైదరాబాద్ రూ.1,872.50, అమరావతిలో రూ.1,841గా ఉంది.

గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803 వద్ద కొనసాగుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సైతం యథావిధిగా కొనసాగుతున్నాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62గా ఉంది.

విమాన ఇంధన ధర 2% పెంపు..

విమాన ఇంధన (Aviation turbine fuel - ATF) ధరలను ఆయిల్ కంపెనీలు రెండు శాతం పెంచాయి. దిల్లీలో ఒక్కో కిలోలీటర్ ధరను రూ.1,827.34 పెంచి రూ.97,975.72 చేశాయి. ఏటీఎఫ్ ధరలను పెంచడం ఇది వరుసగా రెండో నెల. క్రితం నెల కిలో లీట్ప రూ.1,179.37కు పెరిగింది. జూన్లో 6.5 శాతం తగ్గించడం గమనార్హం. ముంబయిలో ప్రస్తుతం కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.91,650.34గా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా ఈ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.