calender_icon.png 1 April, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని బస్తీ వాసుల ఆందోళన

29-03-2025 12:20:04 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం పక్కన రూ 2.30 కోట్ల వ్యయం తో ఏర్పాటుచేసి నిర్వహిస్తున్న రైతు బజార్ ను  డంపింగ్ యార్డ్  మార్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని బూడిది గడ్డ బస్తి ప్రజలు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు ముందుచూపు లేకుండా పట్టణ నడిబొడ్డులో నిర్వహిస్తున్న రైతు బజార్ ను డంపింగ్ యార్డ్ మార్చడం వల్ల బస్తీ మొత్తం తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, దీంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనట్లయితే మునిసిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కు దిగుతామని హెచ్చరించారు.