న్యూఢిల్లీ, నవంబర్ 29: అక్టోబర్ నెలలో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి 3.1 శాతానికి మందగించింది. నిరు డు ఇదేనెలలో కీలక రంగాలు 12.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ అక్టోబ ర్‌లో క్రూడాయిల్, సహజవాయువుల ఉత్పత్తి క్షీణించిందని శుక్రవారం విడు దలైన అధికారిక గణాంకాలు వెల్లడిం చాయి.
బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి 18.4 నుంచి 7.8 శాతానికి, ఎరువుల ఉత్పత్తి 5.3 శాతం నుంచి 0.4 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 16.9 శాతం నుంచి 4.2 శాతానికి, సిమెంట్ ఉత్పత్తి 20.4 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి మాత్రం 4.1 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది.