calender_icon.png 18 November, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందగించిన పరిశ్రమల వృద్ధి

13-11-2024 12:00:00 AM

సెప్టెంబర్‌లో వృద్ధి 3.1 శాతానికి పరిమితం

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 3.1 శాతానికే పరిమితమయ్యింది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో మెరుగైన వృద్ధిని కనప ర్చినప్పటికీ, 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే వృద్ధి రేటు తగ్గినట్లు మంగళవారం జాతీయ గణాంకాల శాఖ వెల్లడించింది. నిరుడు సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 6.4 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది ఆగస్టులో వృద్ధి 0.1 శాతం క్షీణించింది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్‌లో మైనింగ్ రంగం 0.2 శాతం, తయారీ రంగం 3.9 శాతం వృద్ధి సాధించగా, విద్యుదుత్పత్తి 0.5 శాతం పెరిగింది.