కమలాపూర్ గ్రామసభలో ఎమ్మెల్యేకు నిరసన సెగ
కాంగ్రెస్‌ను విమర్శించడంతో ఆగ్రహించిన కార్యకర్తలు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
జనగామ, జనవరి 24 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో శుక్రవారం ఇందిరమ్మ భరోసా, రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు గ్రా నిర్వహించగా ముఖ్య అతిథిగా స్థా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాలతోపాటు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
ఆరు గ్యారెంటీ పథకాలలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలుకావడం లేదన్నారు. అమలుకాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కమలాపూర్ గ్రామసభలో 1,440 పేర్లు చదువుతారని, అందులో 20 మందికి కూడా ఇండ్లు ఇవ్వబోరని ఆరోపించారు. కుట్రపూరితంగా దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్ చేయలేదన్నారు. భూమి లేని వారికి ఇస్తానన్న రూ.14 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే గ్రామసభలు పెట్టారని అన్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణంలో నుంచి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిం ఆయన గ్రామసభను వాకౌట్ చేస్తున్న ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులు, ట కోడిగుడ్లు విసిరేశారు.
స్టేజీ దిగిన కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా ఆయనపై కొందరు టామాటాలు, చెప్పులు విసిరారు. కౌంటర్‌గా బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై కుర్చీలు లేపడంతో ఘర్షణ మరింత ముదిరి, ఇరు పా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదర పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పేదలకు ఇండ్లు ఇవ్వాలని అడిగితే దాడులు చేస్తారా అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారే తనపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు. రోజుకో పార్టీ మారే బ్రోకర్ గాళ్లకు భయపడేది లేదని ఘాటుగా స్పందించారు. వారి సం తాము అధికారంలోకి వచ్చాక చూసుకుంటామని హెచ్చరించి వెళ్లిపోయారు. కౌశిక్‌రెడ్డి వెళ్లిపోయిన అనంతరం సభ యథావిథిగా ప్రశాంతంగా కొనసాగింది.