calender_icon.png 16 January, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

03-09-2024 03:24:02 AM

హైదరాబాద్: ఆదివారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250,24 క్యారెట్ల ధర రూ.270 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.66,700, 24 క్యారెట్ల ధర రూ.72,770గా నమోదయ్యాయి. చెన్నైలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,700, 24 క్యారెట్ల ధర రూ.72,770గా  ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.  హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1000 మేర తగ్గి 86,000గా ఉంది. ఇదే ధరలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.