బెంగళూరు: బెంగళూరుకు చెంది న ఫిన్‌టెక్ స్టార్టప్ ‘స్లైస్’ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో తన విలీనాన్ని పూర్తి చేసింది. అవసరమైన షేర్‌హోల్డర్, రెగ్యులేటరీ అనుమతులు పొందిన తర్వాత అక్టోబర్ 27 నుంచి విలీన ప్రక్రియ అమల్లోకి వచ్చినట్లు సోమవారం తెలిపింది. ఈ విలీనం రెండు సంస్థల కార్యకలాపాలు, ఆస్తులు, బ్రాండ్ గుర్తింపులను ఒకే బ్యాంకింగ్ సంస్థగా ఏకీకృతం చేస్తుందని పేర్కొంది.
విలీనమైన సంస్థ ఈశాన్య ప్రాంతంలో తన ఉనికిని మరింతగా పెంచుతుందని, భార త్ అంతటా తన పరిధిని విస్తరిస్తుందని తెలిపింది. 2023 అక్టోబర్‌లో ఎన్‌ఈఎస్‌ఎఫ్‌బీతో విలీనం చేయడానికి ’స్లైస్’ ఆర్బీఐ ఆమోదాన్ని పొం దింది.
ఆ తర్వాత విలీనం కోసం బహుళ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసింది. ఈ ఏడాది మార్చిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. నేషనల్ కంపె నీ లా ట్రిబ్యునల్ ఆగస్టులో విలీనానికి ఆమోదం తెలిపింది.