18-03-2025 12:00:00 AM
తరిగొప్పుల, మార్చి 17: జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. నేరాలు, దొంగతనాల నివారణకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. అవి మరమ్మతుకు రాగా.. కనీసం అధికారులు రిపేర్లు కూడా చేయించడం లేదు. దీంతో దొంగతనాలకు ఊతం ఇచ్చినట్లు అవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తరిగొప్పుల మండడలంలో అన్ని గ్రామాల్లో కలిపి కొన్ని నెలల క్రితం దాదాపు 150 సీసీ కెమెరాలు ఏర్పా టు చేశారు. ఇందులో చాలా వరకు దాతల సహకారంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపం కారణంగా 90 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. మండలకేంద్రంలోని ప్రధాన ఏరియాలతో పాటు, ప్రతీ గ్రామంలో రెండు మూడు నిఘా నేత్రాలు బిగించారు.
సీసీ కెమెరాల నిఘా ఉండడంతో చాలా వరకు నేరాలు తగ్గాయి. వీటి సాయంతో పోలీసు లు చోరీలను కూడా నియంత్రించారు. కానీ ఇటీవల నిఘా నేత్రాలు మరమ్మతుకు వచ్చి అలంకారప్రాయంగా మారడంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానని పోలీసు అధికారులే చెప్తుంటారు.
చోరీ నిందితులను సులువుగా పట్టుకునేందుకు కెమెరాలు దోహదపడుతాయి. కానీ అవి పనిచేయకపోవడంతో ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని, ఇప్పటికైనా సీసీ కెమెరాలను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సీసీ కెమెరాల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
చోరీలకు ఆస్కారం..
సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల పలు చోరీలు బయటికి వచ్చే అవకాశం లేదు. ఎక్కడైనా ఇంట్లో చోరీ జరిగి ఫిర్యాదు చేస్తే తప్ప వెలుగులోకి రావు. ఒకవేళ రాత్రివేళ దొంగలు సంచరిస్తే ఆ విషయాన్ని ముం దే పసిగట్టే అవకాశం లేకపోవడంతో అకస్మాత్తుగా చోరీలు జరిగే ప్రమాదం ఉంది. 4 నెలల క్రితం తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారంలో అర్ధరాత్రి పది మేకలు చోరీకి గురయ్యాయి.
వ్యవసాయ బావి వద్ద దొడ్డిలో ఉంచిన పశువులు మాయమయ్యా యి. గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేస్తే నిం దితుల కదలికలను, అనుమాన వ్యక్తులను గుర్తించే అవకాశం ఉండేది. కానీ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల నిందుతుల ను దొరకబట్టడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ఇప్పటికైనా సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.