02-03-2025 12:00:00 AM
నిద్ర, బరువు, వ్యాయామం... వీటి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఓ అధ్యయనం చేపట్టారు పరిశోధకులు. 46 ఏళ్లు దాటినవారిని కొంతమందిని ఎంపిక చేసి రెండువారాలపాటు వారి నిద్ర సమయం, మేల్కొని ఉన్నప్పుడు చేసే పనుల్ని పరికరాలతో ట్రాక్ చేశారు. వారి సగటు బీపీ, గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయులు, శరీర కొవ్వు తదితరవాటిపై నిద్ర ప్రభావం ఎలా ఉందో గమనించారు. నిద్ర సరిగ్గా లేకుంటే ఆరోగ్యం దెబ్బతింటోందని గుర్తించారు.
నిద్ర తక్కువైతే ఆ నష్టాన్ని వ్యాయామంతో దూరం చేయొచ్చంటున్నారు. అయితే బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు మాత్రం నిద్రలేమిని వ్యాయామంతో పూడ్చలేరంటున్నారు. ప్రత్యేకించి వయసు పెరిగేకొద్దీ ఈ విషయంలో జాగ్రత్త అవసరమట. నిద్ర తక్కువగాపోయే వ్యక్తుల్లో నడుము చుట్టుకొలతలో పెరుగుదల ఉన్నట్టు ఈ పరిశోధనలో గుర్తించారు. అందుకే తగినంత నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు.