20-04-2025 12:00:00 AM
నిద్ర మన శరీరానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది. నిద్ర తగ్గినా, గాని అస్సలు నిద్ర లేకపోయినా గాని అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్ర అనేది శారీరక, మానసిక సమస్యలను పరిష్కరిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, నిద్ర మన శారీరక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అదే విధంగా మన మానసిక ఆరోగ్యం కూడా బాగా ఎక్కువగా ప్రభావితమవుతుంది.
నిద్ర మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు ఒత్తిడి మరింతగా పెరిగి డిప్రెషన్ బారిన పడాల్సి వస్తుంది. దీని కారణంగా మానసిక సమస్యలు తలెత్తి జ్ఞాపకశక్తి తగ్గుతుందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు.
సుదీర్ఘకాలం నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని సైకియాట్రిస్ట్ లు వెల్లడిస్తున్నారు. ఇది పలు సమస్యలకు తగిన పరిష్కారాలకు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. నిద్ర సరిపోకపోవడం అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.