11-02-2025 12:40:57 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో స్కువాక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. రాష్ర్టంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను గుర్తించి ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీలో వాటిని పొందుపరుచాలని ఆదేశించారు.
టూరిజం పాలసీ పై సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఎకో, టెంపుల్, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ప్రభుత్వ సలహాదారు కే శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమలు, ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, సీఎం కార్యాలయ కార్యదర్శులు ఎస్ సంగీత, చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ శ్రీనివాసులు, హెఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ , టీజీటీడీసీ ఎండీ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.