calender_icon.png 27 December, 2024 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెన్స్‌కార్ట్‌తో స్కిల్ వర్సిటీ ఒప్పందం

19-10-2024 01:37:39 AM

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): దేశీయ కళ్లజోళ్ల రిటైలర్ సంస్థ లెన్స్‌కార్ట్‌తో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం స్కిల్ యూనివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. ఆప్టోమెట్రిక్ స్టోర్ అసోసియేట్స్ కోసం శిక్షణ ఇచ్చేందుకు నెల రోజుల కోర్సును నిర్వహిం చేందుకు లెన్స్‌కార్ట్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు.

తొలి బ్యాచ్‌లో 30 మందితో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిభ కనబర్చిన వారికి లెన్స్‌కార్ట్‌లోనే అసోసియేట్స్‌గా ప్లేస్‌మెంట్స్ పొందుతారని చెప్పారు. మానవ వనరులను బట్టి ప్రతినెల ఒక కోర్సును ప్రారంభిస్తామని సుబ్బారావు వివరించారు.