calender_icon.png 9 October, 2024 | 8:42 PM

ఈ నెలలోనే స్కిల్ యూనివర్సిటీ

09-10-2024 02:17:31 AM

మొదటి విడతలో నాలుగు కోర్సులు

రూ.7 కోట్లతో రెడింగ్టన్ ల్యాబ్

దసరా సెలవుల తర్వాత తొలి నోటిఫికేషన్

హైదరాబాద్, అక్టోబర్ 08 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ నెల నుంచే కోర్సులను ప్రారంభిం చనుంది. యువతకు వివిధ రంగాల్లో నైపు ణ్య శిక్షణను అందించి జాబ్ గ్యారెంటీ ఉండే కోర్సులను యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

ఆయా రంగాల్లో పేరొందిన కంపెనీలు, సం స్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను రూపకల్పన చేస్తోంది. ఆయా రంగాల్లో నిపుణులతో విద్యార్థులకు బోధన తరగతులతోపాటు ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ భవనాలకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు.

ఈ ఏడాది గచ్చిబౌలిలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలికంగా యూనివర్సిటీ తరగతులను ప్రారంభించాలని ఇటీవల బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. 

ముందు నాలుగు కోర్సులు..

ఈ నెలల్లోనే నాలుగు కోర్సులు ప్రారంభించన్నుట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. లాజిస్టిక్స్, మెడికల్ అండ్ హెల్త్, ఫార్మా రంగంలో అత్యధిక ఉద్యోగాల డిమాండ్ ఉన్న నాలుగు కోర్సులను మొదటి విడతలో ప్రారంభించనున్నారు. దసరా సెలవుల త ర్వాత ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లు, అర్హతల పూర్తి వివరాల నోటిఫికేషన్ వెలువడనుంది.

త్వరలోనే మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు స్కిల్ యూనివ ర్సిటీ వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని వైస్ ఛాన్స్‌లర్ తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌లో లాజిస్టిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ గ్లోబల్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కంపెనీ రెడింగ్టన్ ముందుకు వచ్చింది. దీనికి దాదాపు రూ.7 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది.

లాజిస్టిక్స్ రంగానికి సంబంధించి రెండు షార్ట్ టర్మ్ కోర్సులను యూనివర్సిటీ ప్రారంభించనుంది. వేర్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్, కీ కంటైనర్ ఎగ్జిక్యూటివ్ పేర్లతో ఈ కోర్సులను నిర్వహిస్తుంది. వీటి నిర్వహణకు లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారం అందిస్తోంది. 

ప్లేస్‌మెంట్ గ్యారెంటీ..

నర్సులకు ఉన్నతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫైన్(ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్) ఫినిషింగ్ కోర్సులను యూనివర్సిటీ ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది. అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్‌తో కలిసి ఈ కోర్సు నిర్వహించనుంది. డా.రెడ్డీస్ ఫార్మా అసోసియేట్ పేరుతో అప్రెంటిస్‌షిప్ ఇండక్షన్ కోర్సును యూనివర్సిటీ ఈ ఏడాది నుంచే ప్రారంభించనుంది.

డా.రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో ఈ కోర్సును నిర్వహించనుంది. ఈ కోర్సు కాల వ్యవధి 6 నెలలు ఉండనుంది. యూనివర్సిటీ ప్రారంభించనున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ గ్యారెంటీగా వస్తుందని వీసీ అభిప్రాయపడ్డారు. నైపుణ్య శిక్షణను అందుకున్న విద్యార్థులకు నెలకు కనీసం రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం ఉండే ఉద్యోగాల్లో చేరే అవకాశాలుంటాయని తెలిపారు.