calender_icon.png 30 March, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిస్కోతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం

27-03-2025 01:54:39 AM

యువత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న ప్రముఖ టెక్ కంపెనీ

హైదరాబాద్, మార్చి 26( విజయక్రాంతి): సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ సిస్కో, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ మేరకు స్కిల్స్ యూనివర్సిటీకి, సిస్కో సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్   సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.