calender_icon.png 20 March, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల పెంపకంపై ముగిసిన నైపుణ్య శిక్షణ

20-03-2025 01:26:10 AM

కూసుమంచి , మార్చి 19 (విజయ క్రాంతి):కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని మత్స్య పరిశోధన స్థానంలో ములుగు జిల్లా  తెలంగాణ (షెడ్యూల్ ట్రైబ్) మత్స్య కారులకు జరుగుతున్న ‘మత్స్య రంగంపై క్షేత్రస్థాయి సందర్శన ‘ అను అంశంపై 3  రోజుల నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని సైన్సిస్ట్ శ్యాం ప్రసాద్ తెలిపారు. 

ఈ శిక్షణ కార్యక్రమంలో ములుగు జిల్లా నుంచి 10 మంది మత్స్యకారులు శిక్షణ పొందారు. బుదవారం శిక్షణ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులు శివారెడ్డి ఆక్వా ఫారమ్స్, నల్గొండలో వనామి రొయ్యల సాగు గురించి వెన్నమీ రొయ్యల సాగులో అనుసరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి క్షేత్రస్థాయిలో మత్స్య రైతులకు వివరించారు.

  జాతీయ మత్స్య అభివృద్ధి మండలి హైదరాబాద్ ను మత్స్యకారులు క్షేత్రస్థాయిలో  సందర్శించి జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాలైన చేపల సబ్సిడీ స్కీములను గురించి  రైతులు అక్కడ ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ద్వారా తెలుసుకున్నారు.