calender_icon.png 22 January, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేళ్లలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ

24-07-2024 01:28:23 AM

ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణం

నైపుణ్యాభివృద్ధి కోసం మోడల్ స్కిల్లింగ్ లోన్ పథకం 

హబ్ స్పోక్ మోడల్‌లో 1000 ఐటీఐల అప్‌గ్రేడ్

న్యూఢిల్లీ, జూలై 23 : యువత నైపుణ్యాలను పెంపొందించడం కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు.  విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ.1.48 లక్షల కోట్లు ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 1000 వరకు ఐటీఐలను హబ్ స్పోక్ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు రూ.7.5 లక్షల వరకు రుణాలను అందించడానికి ప్రభుత్వం మోడల్ స్కిల్లింగ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంతో పనిచేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించే పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌లను టాప్ 100 కంపెనీల్లో అందించనున్నారు. శిక్షణ పొందే ప్రతి విద్యార్థికి నెలకు రూ. 5000 ఇంటర్న్‌షిప్ అలవెన్స్ అందనుంది.