27-03-2025 12:50:38 AM
-అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మహబూబ్ నగర్ మార్చి 26 (విజయ క్రాంతి) : యువతకు స్కిల్స్ అందిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికే అవకాశం ఉంటుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సంభాషించారు.
సాఫ్ట్వేర్ కంపెనీలలో రెండేళ్లు మూడేళ్లు చేస్తూ ఇతర కంపెనీలు మారుస్తూ వేతనాల పెంపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, కొన్నేళ్ల తర్వాత వారికి ఉద్యోగాల అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొన్ని కంపెనీలతో ప్రభుత్వం అనుసంధానం ఏర్పాటు చేసుకొని నాణ్యమైన విద్యతో పాటు స్కిల్స్ అందిస్తూ ఐదేళ్లపాటు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన మంచి మంచి వేతనంతో యువత జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ముందు ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థను తీసుకురావడం అద్భుతమని కొనియాడారు.