calender_icon.png 27 April, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు

27-04-2025 12:44:41 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ర్టంలో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. విద్యార్థులకు కావాల్సిన శిక్షణను ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) సహకారా న్ని తీసుకోనుంది. వచ్చే నెలలోనే ఎన్‌ఎస్‌డీసీతో ఎంఓయూను కుదుర్చుకోనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.

ఈ ఎంవోయూ తర్వాత రాష్ర్టంలో ఎవరెవరికి ఎందులో శిక్షణ ఇవ్వాలనే అంశంపై రాష్ర్టవ్యాప్తంగా సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ఆధారంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంట ర్లు సైతం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తొలుత నాగరకర్నూల్, నారాయణ పేట జిల్లాల్లో  స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసే యోచన చేస్తున్నామని వెల్లడించారు. ఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మొత్తం 39 స్కిల్ సెక్టార్లున్నాయి.