calender_icon.png 1 February, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి కొత్తగూడెం పరివాహక ప్రాంత ప్రజలకు భరోసా కల్పించండి

01-09-2024 05:38:47 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని పరివాహక గ్రామీణలకు భరోసా కల్పించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఉలవనూరు వాగు వరదమంపులో నష్టపోయిన పేదలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్కే షాబీర్ పాషా మాట్లాడుతూ... మందిరకలపాడు చెరువు అలుగు కారణంగా రోడ్డుకు భారీ గండిపడి సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా అన్నారు.  కిన్నేరసాని అనుబంధ కాలువల పరివాహక ప్రాంతాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు అధికారుల ముంపు ప్రాంతాల్లో గడపాలన్నారు. పంటల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. నిర్వాసితులుగా మారిన ప్రజలను పునరావసకేంద్రాన్ని తరలించి ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు ,పట్టణ కార్యదర్శి అరుసుమల్లి సాయిబాబా, వేములపల్లి శ్రీను ,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు