calender_icon.png 9 January, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచారం కేసులో 60 సంవత్సరాల జైలు

01-01-2025 01:14:26 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 31: ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసుల్లో నిందితునికి మూడు కేసుల్లో 20 సంవత్సరాల చొప్పున మొత్తం 60 సంవత్సరాలు కఠిన  కారాగార శిక్ష,రు.1000 చొప్పున 3000 జరిమానా విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పు నిచ్చారు.

అదేవిధంగా ముగ్గురు బాధిత బాలికలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.గొల్లపల్లి  పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన ముగ్గురు మైనర్ బాలికల పై నిందితుడు శివరాత్రి ముత్తయ్య  అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిపై  పోక్సో చట్టం కింద గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పటి  ఎస్సు నరేష్  కేసు నమోదు చేయగా డిఎస్పిలు వెంకట స్వామి, రఘు చంధర్ లు కేసును  విచారించడం జరిగిందని తెలిపారు.

జిల్లా ఎస్పి ఆదేశా ల మేరకు విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానానికి  ఆధారా లు సమర్పించారన్నారు. పి పి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశ పెట్టగా  విచారించిన న్యాయమూర్తి నీలిమ నేరం రుజువు కావడంతో ఒక్కొక్క కేసులో 20 సంవత్సరాల చొప్పున 60 సంవత్సరాలు కారాగార శిక్షతో పాటు రూ. 3000లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించా రని తెలిపారు. నిందితుడికి శిక్ష పడడానికి కృషిచేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.