calender_icon.png 20 November, 2024 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుడాన్ అంతర్యుద్ధంలో 62వేల మంది మృతి

20-11-2024 12:25:57 AM

లవుతున్న అమాయక ప్రజలు

న్యూఢిల్లీ, నవంబర్ 19: సుడాన్‌లో పారామిలిటరీ, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరులో అమాయకులు బలవుతున్నారు. ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫట్టాహ్ అల్ బుర్హాన్, పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ హందన్ దాగ్గో మధ్య విలీన చర్చలు విఫలం కావడంతో.. ఇరువర్గాల పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. 2023 ఏప్రిల్‌లో మొదలైన ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 62వేల మందికి పైగా మృతిచెందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

యుద్ధ వాతావరణంలో తినడానికి తిండిలేక దాదాపు 14 మిలియన్లకు పైగా ప్రజలు వలస వెళ్లారు. సుడాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభానికి తోడు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల వలన పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

పోషకాహార లోపం..

మృతుల్లో ముఖ్యంగా చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఓ చిల్డ్రన్ ఎన్జీవో చేసిన సర్వేలో.. సుడాన్‌లో దాదాపు 40వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడు తున్నారని తేలింది. సరైన సమయంలో వారికి చికిత్స అందకపోతే వాళ్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 

తాగేందుకు నీరు కరువు..

పరస్పర దాడుల వలన.. చాలామంది పౌరులు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లాడుతున్నారు. మరోవైపు చికిత్స అందించాల్సిన ఆసుపత్రులు నాశనం అయిపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. పలు చారిటీలు, సంస్థలు సాయమందించేందుకు వెళ్తు న్నా.. బలగాల దాడులతో వాటికి విఘాత ం ఏర్పడుతోంది. అంతర్యుద్ధం ప్రారంభ ం అవ్వకముందే సుడా న్‌లో ఆరోగ్యరం గం అంతంత మాత్రంగానే ఉండేది.

ప్ర స్తుతం పరిస్థితి మరింత దిగజారింది. గా జా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఇత ర సంఘర్షణలతో పోల్చితే, అధిక పిల్లల మ రణాలు, ప్రమాదకరమైన స్థితిలో సు డా న్ ఉందంటూ నివేదికలు చెబుతున్నాయి.