దేశ రక్షణలో పెద్దముద్దునూర్ యువకులు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూర్ గ్రామంలో సుమారు 60మందికి పైగా యువకులు దేశ రక్షణలో భాగమయ్యారు. సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలి, నది ప్ర దేశాల్లో, నడిసంద్రంలో సైనికులుగా విధు లు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ గ్రామం అందరిచేత ప్రశంసలందుకుంటోంది. 1975 నుం చి వరుసగా దేశ రక్షణ రంగాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, నేవి వంటి రంగాల్లో పనిచేస్తున్నారు. మొట్టమొదట గ్రా మానికి చెందిన బ్రహ్మయ్య సైనికుడిగా సేవలందించారు. ఆయన బాటలోనే పయని స్తూ ప్రస్తుతం దాదాపు సుమారు 60మందికిపైగా సైన్యంలో చేరారు.
పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో రక్షణగా ఉన్నారు. 2019లో కశ్మీర్ బోర్డర్‌లో జరిగిన సర్జికల్ స్ట్రుక్‌లో పాకిస్తాన్ మిలిటెంట్లను హ తమార్చిన ఘటనలో పెద్దముద్దునూర్‌కు చెందిన కిషోర్ కూడా ఉన్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిని పొందుతూ దేశరక్షణ కోసం సైన్యంలో చేరుతున్నారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు కూడా సైన్యంలో పనిచేస్తున్నారు. 60మందిలో 80 శాతం ఆర్మీలో చేరగా నేవీలో ఒకరు, సీఆర్ఫీఎఫ్‌లో నలుగురు, బీఎస్‌ఎఫ్‌లో ముగ్గురు, ఐటీబీపీలో ఇద్దరు, ఏఆర్‌లో ముగ్గురు, సివిల్ కానిస్టేబుల్‌గా ముగ్గురు పనిచేస్తున్నారు. అగ్నిపథ్‌లోనూ ఇద్దరు యువకులు ఆర్మీలో చేరారు.