హైదరాబాద్: ప్రజాభవన్ లో కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో భేటీ ప్రారంభం అయింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయమై సమావేశంలో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు 16వ ఆర్థిక సంఘం అభిప్రాయ సేకరణ చేయనున్నారు. 16వ ఆర్థిక సంఘంతో స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారుల భేటీ కానుంది. ఈ సమావేశానికి డాక్టర్ అరవింద్ పనగారియా అధ్యక్షత వహించారు. ఈ భేటీలో సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అన్నీ జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్య కాంతి ఘోష్ పాల్గొన్నారు.