26-04-2025 12:00:00 AM
సరుకులు తరలించే వాహనాల్లో ప్రజల ప్రయాణం
ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : రుకులను తరలించే వాహనాల్లో ప్రజలను తరలిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా జూలిపిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృ త తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సరకులు తరలించే వాహనాలలో ప్రజలని పరిమితికి మించి తీసుకువెళ్తున్న 6 వాహనాలను సీజ్ చేసినట్లు ఆర్టిఏ అధికారి రవీందర్ కుమార్ తెలిపారు.
వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలకి ప్ర మాదాలపై అవగాహన కల్పించడం జరిగింది. వాహన యజమానులు సరకు రవా ణా వాహనాలలో ప్రజలను తరలించినట్టయితే చట్ట రీత్యా చర్యలు తీసుకొంటమన్నారు. ప్రజలు సైతం సురక్షితమైన రవాణాను ఎంచుకోవాలని కోరారు. ఇలంటూ వాహనాల్లో ప్రయాణం చేయమని వాహన యజమానులకు డ్రైవర్లు ప్రజల చెప్పాలని కోరారు.
ప్రజా రవాణా వాహనాలలో సైతం పరిమితికి మించి ప్రయాణించరాదని సూచించారు. ఒకవేళ తనిఖీ అధికారులు అలాంటి వాహనాలను ఆపి సీజ్ చేసేటప్పుడు దానిలో ప్రయనిస్తున్న ప్రజలు అధికారులని అడ్డుకోకుండా, సహాయరించాలని కొరారు.