calender_icon.png 28 November, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6వేల కోట్లు చెత్త పాలు

28-11-2024 04:44:36 AM

బిట్ కాయిన్ మైనింగ్ హార్డ్‌డిస్క్‌ను పారేసిన మాజీ గర్ల్‌ఫ్రెండ్

న్యూఢిల్లీ, నవంబర్ 27: గర్ల్ ఫ్రెండ్ చేసిన పొరపాటు కారణంగా జేమ్స్ అనే వ్యక్తి దాదాపు రూ.5,900కోట్లు పోగొట్టుకున్నాడు. బ్రిటన్‌లోని న్యూపోర్ట్ ప్రాంతంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వేల్స్ ప్రాంతానికి చెందిన జేమ్స్ 2009లో బిట్ కాయిన్ మైనింగ్ చేసి ఏకంగా 8వేల బిట్ కాయిన్స్‌ను(ప్రస్తుతం వాటి విలువ రూ.5,900కోట్లు) సొంతం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన హార్డ్‌డిస్క్‌ను నల్లటి కవర్‌లో చుట్టి భద్రంగా దాచారు.

అనంతరం కొన్ని రోజులకు ఇంట్లో చెత్తను శుభ్రం చేయాలని తన గర్ల్ ఫ్రెండ్‌కు సూచించాడు. దీంతో ముందు వెనకా చూడకుండా హార్డ్‌డిస్క్ ఉన్న కవర్‌ను కూడా చెత్తలో పడేసింది. ఈ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతోపాటు వారిద్దరూ విడిపోయారు కూడా. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ 80వేల డాలర్లకు చేరడం, భవిష్యత్తులో దాని విలువ లక్ష డాలర్లకు చేరవచ్చనే అంచనాల నేపథ్యంలో జేమ్స్ హార్డ్‌డిస్క్ కోసం వెతకడం ప్రారంభించాడు.

చెత్తను డంప్ చేసే ల్యాండ్ ఫిల్ ప్రాంతాన్ని జల్లెడ పడితే తన దొరుకుతుందని భావించి నగర పాలక సంస్థకు దరఖాస్తు చేశాడు. అతడు వెతకాలనుకుంటున్న ప్రాంతంలో ఇప్పటికే లక్ష టన్నుల చెత్త ఉన్నందున పర్యావరణానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయిం చాడు. తనను అడ్డుకున్నందుకు మున్సిపాలిటీ నుంచి 648 మిలియన్ డాలర్లను పరిహారంగా ఇప్పించాలని కోరాడు.