calender_icon.png 19 November, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో తొలిదశతో ఎల్‌అండ్‌టీకి రూ.6వేల కోట్ల నష్టం

19-11-2024 02:45:46 AM

సమస్యలను అధిగమించేలా రెండో దశ ప్రతిపాదనలు 

హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి 

 సిటీబ్యూరో, నవంబర్ 18(విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో తొలి దశలో ఎల్‌అండ్‌టీకి రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఏడాది రూ.1300 కోట్ల చొప్పున నష్టాన్ని చవిచూసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని భారత ఆడిట్ అండ్ అకౌంట్స్ శాఖ(ఏజీ) కార్యాలయంలో నిర్వహించిన ఆడిట్  వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మెట్రో మొదటి దశ పనుల్లో ఎదురైన ఆర్థిక, సామాజిక సమస్యలను అధిగమించేలా మరింత పటిష్ఠంగా మెట్రో రెండో దశ ప్రతిపాదనలను రూపొందించామని తెలిపారు. రెండో విడత మెట్రోను 76 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్నట్లు పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపామన్నారు. రీజినల్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ సీ శైలజ, తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ (సెంట్రల్) హేమ మునివెంకటప్ప, అకౌంటెంట్ జనరల్  పీమాధవి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ ఆడిట్ వీఎంవీ నావల్‌కిశోర్ పాల్గొన్నారు.