వర్చువల్‌గా ప్రారంభించినున్న సీఎం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(విజయక్రాంతి): జలమండలి పరిధిలోని పలు ప్రాజెక్టులను సీఎం రే వంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అలాగే పనులకూ సీఎం శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.666.72 కోట్ల తో నాగోల్, ఫతేనగర్, మీరాలం, ఖా జాకుంట, మియాపూర్, సఫీల్‌గూడలో చేపట్టిన ఎస్టీపీలు(మురుగుశుద్ధి కేంద్రాలు), వివిధ ప్రాంతాల్లో రూ.711.39 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ఐమాక్స్ థియేటర్, భారీ అంబేద్కర్ విగ్రహం మధ్య ఉన్న గ్రౌండ్ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. చాంద్రయణగుట్ట నియోజకవ ర్గంలో రూ.301 కోట్లతో చేపట్టబోయే సీవరేజ్ అండర్ డ్రైనేజీ, పాత పైప్‌లైన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.