17-03-2025 08:29:29 PM
ముగ్గురు వ్యక్తులు పరారీ
రూ.3630 నగదు, ఆటో, బైకు స్వాధీనం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని లంబాడి తండ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సోమవారం సాయంత్రం అందిన పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకున్నట్లు తాళ్ల గురిజాల ఎస్ఐ చుంచు రమేష్ తెలిపారు. పేకాట ఆడుతున్న మరో ముగ్గురు వ్యక్తులు పారిపోయినట్లు ఎస్ఐ చెప్పారు. పట్టుబడ్డ వారి నుండి రూ.3630 నగదుతో పాటు ఒక ఆటో, ఒక బైకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తుల్లో మండలంలోని బుధాకలన్ గ్రామానికి చెందిన నిధుల రమేష్, ఎండల రమేష్, రాందేని రవి, దాడి మల్లేష్, ఆవునురి గోపి, బోయిన రవిలు ఉన్నట్లు చెప్పారు. దుర్గం రాజేష్, రాసకొండ తిరుపతి, ఆవునూరి శ్రావణ్ లు పోలీసులను చూసి పారిపోయినట్లు ఎస్ఐ రమేష్ పేర్కొన్నారు.