calender_icon.png 15 January, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీవీఎస్ మోటార్ లాభంలో 6% వృద్ధి

07-08-2024 12:45:56 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 6: టీవీఎస్ మోటార్ కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 6 శాతం వృద్ధిచెంది రూ.461 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.434 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన క్యూ1లో మొత్తం ఆదాయం రూ.9.142 కోట్ల నుంచి రూ. 10,448 కోట్లకు పెరిగింది. టీవీఎస్ మోటార్ స్టాండెలోన్ నికరలాభం రూ.468 కోట్ల నుంచి రూ. 577 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 7,275 కోట్ల నుంచి రూ. 8,412 కోట్లకు చేరింది.

ఎగుమతులతో సహా ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాలు 14 శాతం వృద్ధిచెంది 10.87 లక్షల యూనిట్లకు పెరి గినట్టు కంపెనీ తెలిపింది. మోటార్‌సైకిల్స్ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 5,14 యూనిట్లకు పెరిగాయన్నది. అందులో స్కూటర్ల విక్రయాలు 19 శాతం పెరిగి 4.18 లక్షల యూనిట్లకు చేరినట్టు టీవీఎస్ మోటార్ తెలిపింది.