25-03-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): కుల బహిష్కరణ కేసులో స్పెషల్ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి కలిదిండి దుర్గ రాణి ఆరుగురు నేరస్తులకు నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.500 చొప్పున జరిమా నా విధిస్తూ సోమవారం తీర్పును ఇచ్చారు.
కోర్టు లైసెన్స్ అధికారి పండరి తెలిపిన వివరాల మేరకు... ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలం వడూరుకి చెందిన తీగల ఎడన్న ఆస్తి వివాదంలో కుల పెద్దలు 2019 లో పంచాయతీ నిర్వహించి, కుల బహిష్కరణ చేశారు. ఈ మేరకు బాధితుడు పోలీసు లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నేరం రుజువైనందున సోమవారం కోర్టు తీర్పును వెలువరించింది.