భద్రాద్రి జిల్లాలో ఐదుగురు, సూర్యాపేటలో ఒకరు
భద్రాద్రి కొత్తగూడెం/సూర్యాపేట, అక్టోబర్ 15 (విజయక్రాంతి)/చర్ల: భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. బూర్గంపాడు మండలం బుడ్డగూడెం గ్రామానికి చెందిన సోడే సారయ్య(26), సోడే నరేష్ (35) డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం పాల్వంచకు వెళ్లారు. పాల్వంచ నుంచి భద్రాచలం వైపు బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరూ మృతి చెందారు. సారయ్యకు భార్య, నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్ ఎస్సై సురేష్ కేసు దర్యా ప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో పాల్వంచ పట్టణ పోలీస్టేషన్ పరిధిలోని అదే కాలనీలో మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు(50) మృతి చెందాడు. పాల్వంచ పట్టణ రెండో ఎస్సై రాఘవయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని ఇద్దరు..
చర్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఒక విద్యార్థి స్వల్పగాయాలతో బయటప డ్డాడు. చర్ల మండలంలోని జిపిపల్లి గ్రామానికి చెందిన రెవంత్‌రాజ్(15), మురళీ కృష ్ణ (16), యాకూబ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఎదురుగుట్ట సమీపంలో గల సమ్మక్క సారలమ్మ గుడికి వెళ్లి ఒకే బైక్‌పై తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో చర్ల నుంచి ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని తప్పించబోయి ఇసుక లారీని ఢీకొట్టడంతో రెవంత్‌రాజ్, మురళీ కృష మృతి చెందారు. యాకూబ్ తీవ్రగాయాలతో బయటపట్టాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన బెక్కం శ్రీరాం(11) తన తమ్ముడు సాయిరాంను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తన అమ్మమ్మ వెంకటలక్ష్మీతో కలిసి రోడ్డు మీదకు వచ్చాడు.
తమ్ముడిని బస్సు ఎక్కించిన అనంతరం తిరిగి అమ్మమ్మతో కలిసి రోడ్డు దాటుతున్న క్రమంలో గరిడేపల్లి నుంచి హుజూర్‌నగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి శ్రీరాంను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. బాలుడి తండ్రి అశోక్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్సై నరేశ్ తెలిపారు.