11-04-2025 08:44:43 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుడిపేట శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను శుక్రవారం సాయంత్రం పట్టుకుని అరెస్టు చేసినట్లు భీమిలి ఎస్సై విజయ్ కుమార్ విజయ్ కుమార్ తెలిపారు. వీరి వద్దనుండి రూ 6700 నగదు తో పాటు ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.