బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామ శివారులో పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం రాత్రి తాళ్ల గురిజాల పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి రూ.18,850 నగదుతో పాటు మూడు సెల్ ఫోన్లు, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన బెడిద తిరుపతి, సింగతి మధుకర్, సింగతి కుమార్, చింతం కృష్ణస్వామి, గోపి వెంకటేష్, కుదిరి సత్యనారాయణ ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చుంచు రమేష్ తెలిపారు.