హైదరాబాద్,(విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీసులు(Chikkadpally Police) సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో నోటీసులిచ్చారు. పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమన్య(Sandhya TheatreManagement) లేఖ ద్వారా సమాధానం ఇచ్చింది. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులున్నాయంటూ యాజమాన్యం పోలీసులకు 6 పేజీల లేఖను పంపించింది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని వెల్లడించారు. పుష్ప-2 ప్రీమియర్ షోకు విధుల్లో 80 మంది థియేటర్ సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
ఈనెల 4,5వ తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రి మూవీస్(Mythri Movies) తీసుకుందని యాజమాన్యం తెలిపింది. సినిమాల విదుడల గతంలోనూ హీరోలు థియేటర్ కు వచ్చారని, సంధ్య థియేటర్ లో కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ ఉందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనపై మంగళవారం పుష్ప(Pushpa) సినిమా నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్(Chikkadpally Police Station)లో విచారించిన విషయం తెలిసిందే. థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేణుక కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ ఘటనలో గాయపడ్డిని బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కొలుకుంటున్నాడు.