21-04-2025 08:59:59 AM
రాంచీ: జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో సోమవారం ఉదయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force), స్థానిక పోలీసులకు చెందిన కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సల్స్ మరణించారని అధికారులు తెలిపారు.అధికారుల ప్రకారం, లాల్పానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుగు హిల్స్ ప్రాంతంలో ఉదయం 5:30 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఈ ఆపరేషన్ ప్రారంభించాయని వారు తెలిపారు. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (CoBRA) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. దీంలో ఆరుగురు నక్సల్స్ మరణించారని, రెండు ఐఎన్ఎస్ఏఎస్(INSAS) రైఫిల్స్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (Self-Loading Rifle), ఒక పిస్టల్, భారీగా ఆయుదాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందిలో ఎటువంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో వివేక్ పై రూ. కోటి రివార్డు ప్రకటన ఉందని అధికారులు వెల్లడించారు.