- సౌర వ్యవస్థ వెలుపల కనుగొన్న నాసా
- 5,502కు చేరిన ప్లానెట్లు
న్యూ ఢిల్లీ, జూలై 17: సౌర వ్యవస్థ వెలుపల కొత్తగా ఆరు ఎక్సోప్లానెట్‌ల(గ్రహాలు) ను కనుగొన్న నాసా అంతరిక్ష కేంద్రం చరిత్ర సృష్టించింది. దీంతో మన సౌర వ్యవస్థను దాటి ధృవీకరించబడిన మొత్తం గ్రహాల సంఖ్య 5,052కి చేరింది. ఈ కొత్త మైలురాయి విశ్వం, భూమి, సౌర వ్యవస్థను దాటి మానవ మనుగడకు సంబంధించి పరిశోధనలు చేయడానికి అవకాశం దొరికినట్ల య్యింది. ఈ ఆరు ప్లానెట్లను 1) HD 363 84 b, 2)TOI--- b, 3)TOI-- b, 4)TOI- c, 5)TOI- b, 6)MWC758 c గా పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణల కోసం రేడియల్ వెలాసిటీ టెక్నిక్‌తో పాటు వివిధ గుర్తిపు పద్ధతులను ఉపయోగించారు.
ఈ కొత్త గ్రహాలు క్షక్ష్యలో ఉన్న గ్రహాల వల్ల ఏర్పడే నక్షత్రచలనాన్ని కొలుస్తాయి, గ్రహాలు వాటి అతిధేయ నక్షత్రాల ముందు వెళ్తున్నప్పడు నక్షత్రాల కాంతి మసకబారడాన్ని గుర్తించవచ్చు. సుమారు 31 సంవత్సరాల క్రిత 1992లో పల్సర్PSR B1257+12 చుట్టూ తిరుగుతున్న జంట గ్రహాలు, poltergiest, phobetorను గుర్తించినప్పడు శాస్త్రవేత్తలు మొదటి ఎక్సో ప్లానెట్‌లను నిర్ధారించారు. తదనంతరం మార్చి 2022 నాటికి కనుగొనబడిన ప్లానెట్ల సంక్య 5వేలకు చేరింది. తాజాగా కనుగొన్న గ్రహాలను అన్నీ కలిపితే ప్రస్తుతం వాటి సంఖ్య 5,502కి చేరింది.
ఇలాంటి సుదూర గ్రహాల గురించి మన అవగాహన పెరిగే కొద్దీ నివాసయగ్యమైన గ్రహాలను కనుగొనడం, విశ్వంలో మన స్థానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం వంటి వాటిపై పరిశోధనలు జరుపవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నాసా 2027లో నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందులో ఎక్సో ప్లానెట్లను నేరుగా చిత్రించడానికి రూపొందించిన కరోనాగ్రాఫ్ పరికరం ఉంది. ఈ సాంకేతికత మన సౌర వ్యవస్థ వెలుపలి గ్రహాలపై జీవన సంకేతాలను శోధించేందుకు పనికివస్తుందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.