calender_icon.png 24 October, 2024 | 5:55 AM

భూమికి సమీపంగా ఆరు ఉల్కలు

24-10-2024 03:34:51 AM

నేడు అతిదగ్గరగా 

రానున్న గ్రహశకలాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఆరు ఉల్కలు గురువారం భూమికి సమీపం నుంచి వెళతాయని నాసా గుర్తించింది. వీటివల్ల భూమికి ఏ ముప్పు లేకపోయినప్పటికీ భూమికి అతి సమీపం నుంచి వెళ్లనుండటంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గ్రహశకలాల్లో అతిపెద్దది 2002 ఎన్వీ 16. దీని వ్యాసం 310 మీటర్ల వరకు ఉంటుందని అంచనా. అతిచిన్నది 2023టీజీ14. దీని వ్యాసం 41 మీటర్లు ఉంటుంది. ఇదే ఉల్క భూమికి అతి సమీపం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. ఈ ఆరు గ్రహశకలాలను ప్రమాదకరం కానివిగా నాసా వర్గీకరించినప్పటికీ నిరంతరం ఇలాంటి వస్తువులపై నిఘా పెట్టడం వల్ల అంతరిక్షంలో వాతావరణం గురించి అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ముందే గుర్తించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.