calender_icon.png 30 September, 2024 | 1:57 AM

ఆరు జంక్షన్లు.. రూ.826 కోట్లు

29-09-2024 02:05:56 AM

కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణం

పనులు ప్రారంభించేందుకు బల్దియా కసరత్తు

రెండు దశల్లో ఫ్లుఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం

పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు ఫుల్‌స్టాప్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరవ్యాప్తం గా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతా ల్లో కేబీఆర్ పార్క్ పరిసరాలు ప్రధానమైనవి. ఉదయం, సాయం త్రం వేళల్లో ఈ ప్రాంతాలను దాటి ఇంటికి చేరడమంటే పెద్ద ప్రహసనమే.

ట్రాఫిక్ రద్దీనీ నివారించేందుకు, వాహనదారులు సాఫీగా ప్రయా ణం సాగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నది. దీనిలో భాగంగానే సిగ్నల్ రహిత జంక్షన్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. పార్కు చుట్టూ ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు బల్దియా రూ. 826 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పనులు రెండు దశల్లో చేపట్టనున్నది.

ప్రాజెక్ట్‌లో భాగంగా ఫ్లుఓవర్లతో పా టు అండర్ పాస్‌లు నిర్మించనున్నది. దీంతో నిత్యం మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లేవారి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులు సిగ్నల్ రహిత ప్రయాణం సాగించవచ్చు.

వీటిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్క్ అండ్ ముగ్దా జంక్షన్లను మొదటి దశలో, రోడ్డు నంబరు 45, ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్, కాన్సర్ ఆసుప్రతి జంక్ష న్లను రెండో దశలో పూర్తి చేయనున్నారు. ఇలా మొత్తం ఏడు అండర్ పాస్‌లు, ఆరు ఫ్లుఓవర్లు, ఒక యూనీ డైవర్షనల్ లేన్ అందుబాటులోకి రానున్నది.

ఆ తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని, నగర రూపురేఖలు మరింత మారే అవకాశాలు ఉంటాయని బల్దియా భావిస్తున్నది. మొదటి దశలో చేపట్టే జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు అండ్ ముగ్దా జం క్షన్లకు రూ. 421 కోట్లు, రెండో దశలో రూ. 405 కోట్లతో రోడ్డు నంబర్ 45, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, కాన్సర్ ఆసుపత్రి జంక్షన్లు పూర్తి కానున్నాయి.

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు..

  1. రోడ్డు నంబరు 45 నుంచి కేబీఆర్ పార్క్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వెళ్లేలా అండర్‌పాస్ నిర్మాణం 
  2. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్డు నంబర్ 36 వైపు 4 లేన్ ఫ్లుఓవర్ 
  3. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నంబర్ 45 వరకూ 2 లేన్ల ఫ్లుఓవర్ 
  4. కేబీఆర్ పార్క్ అండ్ ముగ్దా జంక్షన్..
  5. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కాన్సర్ హాస్పిటల్ వైపు 2 లేన్ అండర్‌పాస్ నిర్మాణం 
  6. పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు 3 లేన్ యూని డైవర్షనల్ రోడ్డు 
  7.  కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు 3 లేన్ అండర్ పాస్ 
  8. రోడ్డు నంబర్ 45..
  9. ఫిల్మ్‌నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకూ 2 లేన్ అండర్ పాస్ 
  10. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి రోడ్డు నంబరు 45 వైపు 2 లేన్ ఫ్లుఓవర్ 
  11. ఫిల్మ్ నగర్ జంక్షన్... 
  12. మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్డు నంబరు 45 వైపు 2 లేన్ అండర్ పాస్ 
  13.  ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి మహారాజ అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ ఫ్లుఓవర్ 
  14. మహారాజా అగ్రసేన్ జంక్షన్.. 
  15. కాన్సర్ ఆసుపత్రి జంక్షన్ నుంచి ఫిల్మ్ నగర్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్ 
  16. ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి రోడ్డు నంబరు 12 వైపు 2 లేన్ ఫ్లుఓవర్ నిర్మాణం 
  17. కాన్సర్ ఆసుపత్రి జంక్షన్.. 
  18.  కేబీఆర్ పార్కు వైపు నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్ 
  19.  మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్డు నంబర్ 10 వైపు 2 లేన్ ఫ్లుఓవర్ నిర్మాణం