హైదరాబాద్: పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో.. పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్ మూవీని తెరకెక్కించిన విధానం బావుంది. ఆయనతో పాటు సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా బాగుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ‘మా అందరినీ ఆశీర్వదించేందుకు వచ్చిన రమేష్ రెడ్డి అన్నకి, వెంకట్ రెడ్డి అన్నకి, ప్రతాప్ రెడ్డి అన్నకి థాంక్స్. మాకోసం వచ్చిన మీడియా వారికి థాంక్స్. మా హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారు. రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ గారు మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి గారు మా అందరికీ టీచర్. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను నిర్మించడం, ఇందులో నటించడం ఆనందంగా ఉంది. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ బసీర్‌గారు సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన చాలా ప్లానింగ్‌తో ఉండటం వల్ల అనుకున్నట్లే సినిమాను బెస్ట్‌గా రూపొందించగలిగాం. టీజర్ అందరికీ నచ్చేలా ఉంది. చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
సమీర్ దత్త మాట్లాడుతూ.. ‘మా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి రోల్‌ను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత రవి గారు డబ్బులు పెట్టడమే కాదు.. ఈ చిత్రంలో మంచి పాత్రను కూడా పోషించారు. బసీర్ గారు సినిమాను అద్భుతంగా తీశారు. టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను’ అని అన్నారు. హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ.. ‘ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత రవి గారు మాతో పాటు నటించారు. మా కెమెరామెన్ వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది’ అని అన్నారు.
హీరోయిన్ రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘మా కోసం వచ్చిన రమేష్ రెడ్డి గారికి థాంక్స్. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాత రవి గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. మాతో మున్ముందు సినిమాలు తీస్తూ, నటిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అవంతిక మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రవి గారు ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూడండి’ అని అన్నారు.