మాజీ మంత్రి హరీశ్‌రావు
మెదక్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఇందిరమ్మ పాలనలో అడిగితే అదరగొట్టుడు.. ప్రశ్నిస్తే పగబట్టుడు తప్ప ఇంకేమీ లేదని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెదక్ చర్చిలో శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడ్డాయని, గడిచిన ఒక్క ఏడాదిలోనే 35వేల కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఈ ఒక్క ఏడాదిలోనే 41 శాతం క్రైంరేటు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల కంటే సినీ హీరో అల్లు అర్జున్ సమస్యే ముఖ్యమైనదిగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆరు గ్యారెంటీల గురించి చేతులెత్తేశారని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో 45 లక్షల టన్నుల సన్నవడ్లు కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారని.. కానీ కొన్నది మాత్రం 18 లక్షల టన్నులు మాత్రమేనని హరీశ్‌రావు ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.