పోతినేని సుదర్శన్ డిమాండ్
ములకలపల్లి, నవంబర్ 21 : ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మత విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. జమిలీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు , ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఆర్ఓఎఫ్ఆర్ హక్కుపత్రాలు ఇచ్చిన పోడు భూములకు బోరు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరారు.