బలోద్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో, రాంగ్ సైడ్ నుండి వస్తున్న ట్రక్కు కారును ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. దొండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని భానుప్రతాప్‌పూర్-దల్లిరాజహార రహదారిపై చౌరపవాడ్ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ట్రక్కు ఢీకొట్టింది. క్షతగాత్రులను రాజ్‌నంద్‌గావ్ మెడికల్ కాలేజీకి తరలించారు.
ప్రమాదం గురించి వివరాలను అందజేస్తూ, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఫీ) అశోక్ జోషి మాట్లాడుతూ, నిందితుడు ట్రక్ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానికుల సాయంతో గంటల తరబడి శ్రమించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం ప్రకారం, కారులోని వ్యక్తులు దుండిలోని కుంభాకర్‌లో బంధువుల ఇంట్లో ఛత్తీ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామం గురేడకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.