07-03-2025 12:29:55 AM
ఉత్తర్వులు జారీచేసిన జోగులాంబ జోన్ డిఐజి ఎల్‌ఎస్ చౌహన్
మహబూబ్ నగర్ మార్చి 6 (విజయ క్రాంతి) : జోగులాంబ జోన్ పరిధిలో ఆరు మంది పోలీస్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జోగులాంబ జోన్ డిఐజి ఎల్‌ఎస్ చౌహన్ పేర్కొన్నారు. పదోన్నతి అంటే బాధ్యత మరింత పెరగడమే అని, ప్రత్యేక శ్రద్ధ వహించి పదోన్నతి పొందిన పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు.