calender_icon.png 28 October, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డర్ చెక్ పోస్టుల ఏర్పాటు: జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్

28-10-2024 09:54:35 PM

నారాయణపేట,(విజయక్రాంతి): రాబోయే ఖరీఫ్ కొనుగోళ్లలో పోరుగు రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వరి ధాన్యం రాకపోకలను నివారించేందుకు నారాయణపేట జిల్లా పరిధిలో 06 బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్  తెలిపారు. 

బోర్డర్ చెక్ పోస్టులు అవి:

1) జలాల్పూర్ చెక్ పోస్ట్, నారాయణపేట

2) కాన్కుర్తి చెక్ పోస్ట్, దామరగిద్ద

3) చేగుంట చెక్పోస్ట్, కృష్ణ

4) కృష్ణ బ్రిడ్జి చెక్ పోస్ట్, కృష్ణ

5) సమస్తాపూర్ చెక్ పోస్ట్, ఉట్కూర్

6) ఉజ్జెల్లి చెక్పోస్ట్, మాగనూరు

ఈ బోర్డర్ చెక్ పోస్టులో పోలీస్ అధికారులతో పాటు, రెవెన్యూ అధికారులు ఉండి పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుండి వరి ధాన్యం రాకుండా చూడాలని, వాహనాల వే బిల్లులను తనిఖీ చేయాలని సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఉంటే చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెక్పోస్ట్ దగ్గర వచ్చి పోయే ప్రతి ఒక్క వాహనాల నంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. వ్యాపారస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్పోస్టుల వద్దనే కాకుండా బోర్డర్ గ్రామాల నుండి జిల్లాలోకి రాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, పోలీస్ స్టేషన్లో ఉన్న SHO లు నిరంతరం చెక్ పోస్ట్ పై నిఘా ఉంచాలని చెక్ పోస్ట్ లో వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు రెవెన్యూ అధికారులను నిరంతరం తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని తెలిపారు.