35 బైక్‌లు స్వాధీనం
గద్వాల(వనపర్తి), డిసెంబర్ 2 (విజయక్రాంతి): గద్వాల జిల్లాలో కొన్ని రోజులుగా బైక్ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీ సులు సోమవారం అరె స్టు చేసి, 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఎనిమిది మంది ముఠా గా ఏర్పడి రాత్రి సమయాల్లో కాలనీల్లో రెక్కీ నిర్వహించి ఇండ్ల ముందు నిలిపిన బైక్‌లను చోరీ చేస్తున్నట్టు తెలిపారు.
గద్వాల పట్ణణంలో కేసులు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సోమవారం ఆరుగురిని అదుపులోకి తీసు కున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 35 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలి పారు. నిందితులను పట్టుకున్న ఎస్సై కళ్యాణ్ రావు, సిబ్బంది చంద్రయ్య, ఇస్మా యిల్‌లకు రివార్డులను అందజేశారు.