10-02-2025 01:34:48 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాం తి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పింగలి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగ ర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిలకు ఆరు సంఘాలు మద్దతు తెలిపాయి. ఈమేరకు ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం బాధ్యులకు ఆయా సంఘాల నేతలు మద్దతు లేఖలు అందజేశా రు.
మద్దతు తెలిపిన వాటిలో తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ అసోసియేషన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్, తెలంగాణ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, తెలంగాణ కేజీబీవీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఉన్నట్లు పీఆర్టీయూ సంఘం ప్రధానకార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో సంఘాల నాయకులు రాజ గంగారెడ్డి, తుకారం, తిరుమల కాంతికృష్ణ, రాఘవరెడ్డి, కృష్ణమూర్తి, విజయసాగర్, నాగరాజు, షకీల్ తదితరులు పాల్గొన్నారు.